Maheshwaram: ఉప సర్పంచ్‌ల సంఘం ఆందోళన చెక్ పవర్ కొనసాగించాలి!

Maheshwaram: మహేశ్వరంలో జిల్లా ఉప సర్పంచ్‌ల సంఘం ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

K Sai, Maheswaram
Published on: 31 July 2026 9:22 AM IST
Maheshwaram
X

Maheshwaram: ఉప సర్పంచ్‌ల సంఘం ఆందోళన చెక్ పవర్ కొనసాగించాలి!

Maheshwaram: జిల్లా ఉప సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు అంకోద్ భాస్కర్ నాయక్ ....

ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ ను తొలగించే కుట్రలు జరుగుతున్నాయని వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఉప సర్పంచ్లకు గౌరవేతనం రూ. 5000 వార్డు సభ్యులకు 3000 ఇవ్వాలని జిల్లా ఉపసర్పల సంఘం అధ్యక్షుడు అంగోత్ భాస్కర్ నాయక్ ప్రభుత్వంని డిమాండ్ చేశారు.

మంగళవారం జిల్లా ఉప సర్పంచ్ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ చంద్ర రెడ్డికి పలు సమస్యలతో కూడిన వినతి ప్రథమ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఉపసర్పంచ్ లు గ్రామ అభివృద్ధికి అడ్డంకి గా మారి సర్పంచులను అభివృద్ధి పనులు విషయం లో సంతకాలు పెట్టకుండా ఇబ్బందులు పెడుతున్నారని తమపై దుష్ప్రభాతం చేస్తున్నారు అన్నారు. అభివృద్ధి సహకరిస్తున్నామని తెలిపారు ఉపసర్పంచ్ లకు చెక్ పవర్ ను తొలగించే కుట్రలు జరుగుతున్నాయని వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

గ్రామపంచాయతీ తీర్మానాల్లో సర్పంచ్లతో పాటు ఉపసర్పంచ్ లకు సంతకాలు చేసే అవకాశం కల్పించాలన్నారు.

ఈ విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అడిషనల్ కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రాల బండి శివకుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మరి నరేష్, ఉపాధ్యక్షులు రోహిత్ బాలరాజ్ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ గౌడ్ అధికార ప్రతినిధి అభినవ్ నియోజకవర్గ అధ్యక్షుడు ఎం గోవర్ధన్ రెడ్డి పలువురు పాల్గొన్నారు.

K Sai, Maheswaram

K Sai, Maheswaram

Next Story