Kandukur: జూన్ 25 నుంచి ఓటర్ల ప్రత్యేక సవరణ.. కందుకూరు ఆర్డీవో వెల్లడి

Kandukur: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మహేశ్వరం నియోజకవర్గంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పై అవగాహన కల్పిస్తూ కందుకూరులో 2K రన్, మానవహారం నిర్వహించారు.

SAI,	MAHESHWARAM
Published on: 23 Jun 2026 12:26 PM IST
Kandukur
X

Kandukur: జూన్ 25 నుంచి ఓటర్ల ప్రత్యేక సవరణ.. కందుకూరు ఆర్డీవో వెల్లడి

కందుకూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మహేశ్వరం నియోజకవర్గ స్థాయి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పై అవగాహన కల్పిస్తూ నేడు కందుకూరు ఆర్డీవో ఆఫీసు నుండి కందుకూరు చౌరస్తా వరకు "2K RUN" నిర్వహించడం జరిగింది.అనంతరం చౌరస్తాలో మానవహారంగా ఏర్పడి SIR ప్రాముఖ్య్యాన్ని తెలియజేయడం జరిగింది.

ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గ ERO/ కందుకూరు ఆర్డీవో గారు మాట్లాడుతూ SIR ఈనెల 25వ తారీకు నుంచి ప్రారంభమవుతుందని చెప్తూ, ఇంటింటి గణన గురించి, అందరూ ఎన్నుమరేషన్ ఫామ్ ను పూర్తి చేసి బిఎల్డీ లకు అందించాలని కోరడం జరిగినది.

ఎన్నికల సంబంధిత అధికారులందరూ SIR లో యాక్టివ్ గా పాల్గొనాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కందుకూరు మండలం ఎమ్మార్వో గోపాల్,కందుకూరు SHO వెంకటేశ్వర్లు, కందుకూరు, మహేశ్వరం, బాలాపూర్ డిప్యూటీ తహశీల్దారులు రాజకీయ పార్టీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

SAI,	MAHESHWARAM

SAI, MAHESHWARAM