Ibrahimpatnam: మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థుల సమస్యలపై మాజీ మంత్రుల ఆరా!

Ibrahimpatnam: మంగళ్‌పల్లి భారత్ కాలేజీలో మహేశ్వరం మెడికల్ విద్యార్థుల సమస్యలను మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి అడిగి తెలుసుకున్నారు.

RAVI, IBRHAMIPATNAM
Published on: 4 Nov 2026 2:15 PM IST
Ibrahimpatnam
X

Ibrahimpatnam: ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని మంగళ్‌పల్లిలో ఉన్న భారత్ కాలేజీలో తాత్కాలికంగా కొనసాగుతున్న మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కాలేజీని మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి సందర్శించారు.

ఈ సందర్భంగా కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తమకు ఎదురవుతున్న ఇబ్బందులను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు.

అన్ని మౌలిక వసతులతో కూడిన శాశ్వత మెడికల్ కాలేజీ భవనాన్ని నిర్మించి, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలని వారు కోరారు. ఈ అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి, తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మాజీ మంత్రులకు విద్యార్థులు విజ్ఞప్తి చేశారు.

RAVI, IBRHAMIPATNAM

RAVI, IBRHAMIPATNAM