Maheshwaram: మహేశ్వరంలో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన పారిజాత

Maheshwaram: మహేశ్వరం మల్లాపూర్, ఇందిరానగర్‌లలో ఎస్ఐఆర్ ప్రక్రియ పరిశీలించిన పారిజాత నర్సింహారెడ్డి. ఆగస్టు 3లోగా ఫారాలు అందజేయాలని పిలుపు.

RAHUL, MEERPET
Published on: 30 July 2026 8:35 PM IST
Maheshwaram
X

Maheshwaram: మహేశ్వరంలో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన పారిజాత

మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని జీహెచ్ఎంసీ (GHMC) బాలాపూర్ డివిజన్ మల్లాపూర్ మరియు బడంగ్ పేట్ డివిజన్ ఇందిరానగర్ ప్రాంతాలలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఎస్ఐఆర్ (SIR) కార్యక్రమాన్ని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో వారి వెంట మాజీ కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, బాలాపూర్ డివిజన్ పరిశీలకులు సురేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, పార్టీ నాయకులు మరియు యువకులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాజీ మేయర్ మాట్లాడుతూ... ఆగస్టు 3వ తేదీతో ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ గడువు ముగియనున్నందున, ఇంకా ఎవరైనా ఎన్యుమరేషన్ ఫారాలను (Enumeration Forms) తిరిగి ఇవ్వనివారు లేదా నమోదు చేసుకోనివారు వెంటనే అప్రమత్తం కావాలి అని, అర్హులైన ప్రతి ఒక్కరూ వెంటనే సంబంధిత బీఎల్ఏ (BLA) లేదా బీఎల్ఓ (BLO) లను సంప్రదించి జాగ్రత్తపడాలని కోరారు.

ఓటు అనేది ప్రజాస్వామ్యంలో అత్యంత బలమైన ఆయుధమని, దానిని కోల్పోతే మన హక్కును మనమే నిర్లక్ష్యం చేసినట్లు అవుతుందని ఆమె స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఎన్యుమరేషన్ ఫారంలో తప్పకుండా నమోదు చేసుకోవాలని, బీఎల్ఓలకు వాటిని అందజేసి ఆన్‌లైన్ కూడా చేయించుకోవాలని పిలుపునిచ్చారు.

RAHUL, MEERPET

RAHUL, MEERPET

Next Story