CP Tarun Joshi: మహేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో సీపీ తరుణ్ జోషి తనిఖీ.. కేసుల పురోగతిపై సమీక్ష!
CP Tarun Joshi: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి మహేశ్వరం పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. పెండింగ్ కేసుల పురోగతిని సమీక్షించి, బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
మహేశ్వరం (రంగారెడ్డి జిల్లా): ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి శనివారం మహేశ్వరం పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ పనితీరును సమీక్షించారు. నమోదవుతున్న కేసులు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించి, బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సిబ్బందికి ఆదేశించారు. కార్యక్రమంలో డీసీపీ నారాయణ రెడ్డి, సీఐ రాఘవేందర్ రెడ్డి, ఎస్సైలు ప్రసాద్, రాఘవేందర్, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story




