Hyderabad: కాంగ్రెస్లో చేరిన ప్రతి ఉద్యమకారుడిని కాపాడుకుంటా మైనంపల్లి!
Hyderabad: మల్కాజిగిరిలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో చేరిక. ఉద్యమకారులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని మైనంపల్లి హనుమంతరావు హామీ.
Hyderabad: కాంగ్రెస్లో చేరిన ప్రతి ఉద్యమకారుడిని కాపాడుకుంటా మైనంపల్లి!
Hyderabad: కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఉద్యమకారుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు.మల్కాజిగిరి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్కు చెందిన పలువురు ఉద్యమ నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఉద్యమకారుడు మాజీ కార్పొరేటర్ ఏకే మురుగేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మైనంపల్లి హనుమంతరావుతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సాయినగర్ చౌరస్తా నుంచి నాయకులు, కార్యకర్తలు, మహిళా ప్రతినిధులు భారీ ర్యాలీగా మల్కాజిగిరి చౌరస్తాకు చేరుకున్నారు. అనంతరం పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు.
ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ.. తనతో కలిసి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరూ తనకు గుర్తున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో గతంలో కంటే మరింత కష్టపడి పనిచేసి మల్కాజిగిరిలోని 16 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులకు తగిన గుర్తింపు, సంక్షేమం లభించలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు అందించామని, కొత్త పెన్షన్లు కూడా అందించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఉద్యమకారులకు ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు అందించే విషయంపై సంబంధిత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడి హామీ తీసుకున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్లో చేరిన నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి అబ్జర్వర్ సమీర్ కౌశల్, మాజీ కార్పొరేటర్లు వై ప్రేమ్ కుమార్, జితేంద్ర నాథ్, మల్కాజిగిరి ఇంచార్జీ లక్ష్మీ కాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు బి బ్లాక్ అద్యక్షుడు వెంకటేష్ యాదవ్ బీకే శ్రీను, గుండా నిరంజన్, జిఎన్వి సతీష్ కుమార్ పిట్టల శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షులు జీడి సంపత్ గౌడ్ వినోద్ యాదవ్ సత్యమూర్తి, యూసుఫ్ భాయ్, పిట్టల నాగరాజు,వైనాల ప్రవీణ్, రాందాస్ సంతోష్ ముదిరాజ్, రామచందర్, బాబు, సత్యనారాయణ,ఆశా, ఇందిర ప్రియదర్శిని,రోజా రమణి,ప్రభా,సుమలత, పుష్పలత శారద,కనక లక్ష్మీ, ఫరీద్, తదితరులు పాల్గొన్నారు.




