Tandur: చెన్నారంలో వైభవంగా మైసమ్మ తల్లి బోనాల ఉత్సవాలు!

Tandur: వికారాబాద్ జిల్లా తాండూరు మండలం చెన్నారం గ్రామంలో మైసమ్మ తల్లి బోనాల ఉత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి.

Srikanth Reddy, Tandur
Published on: 7 Aug 2026 11:30 PM IST
Tandur
X

Tandur: చెన్నారంలో వైభవంగా మైసమ్మ తల్లి బోనాల ఉత్సవాలు!

తాండూర్: కోరికలు తీర్చే కల్పతరువు అమ్మలు గన్న అమ్మ మైసమ్మ బోనాల ఉత్సవాలు మండలం చెన్నారం గ్రామంలో శుక్రవారం వైభవంగా జరిగాయి. గ్రామ సర్పంచ్ నవీన పవన్ రెడ్డి ఆధ్వర్యంలో బోనాల కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ నవీన పవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మైసమ్మ తల్లిని మనసా వాచా కర్మణా సేవిస్తున్నామన్నారు. ఆ తల్లి చల్లని దయతో గ్రామం సుభిక్షంగా ఉందన్నారు. గ్రామంలో కోరికలు తీర్చే కల్పతరువు మైసమ్మ తల్లికి బోనం ఎత్తి అమ్మవారికి హారతి అందించారు. పాడిపంటలతో రైతులు సుభిక్షంగా ఉండాలని అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని ఈ సందర్భంగా కోరామని అన్నారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur

Next Story