Kadthal: మైసిగండి గ్రామంలో వైభవంగా బతుకమ్మ సంబరాలు!
Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండిలో ఉత్సాహభరితంగా బతుకమ్మ సంబరాలు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి ఆడిపాడిన మహిళలు.
Kadthal: మైసిగండి గ్రామంలో వైభవంగా బతుకమ్మ సంబరాలు!
Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి గ్రామంలో బతుకమ్మ సంబరాలు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి వేడుకల్లో పాల్గొన్నారు. పాటలు పాడుతూ, బతుకమ్మల చుట్టూ ఆడిపాడుతూ పండుగ సందడిని మరింత పెంచారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్, పద్మశ్రీ, గ్రామ సర్పంచ్ ప్రేమ జవహర్ లాల్ నాయక్, ఉపసర్పంచ్ హీరాసింగ్ నాయక్ పాల్గొన్నారు. అలాగే సరోజ, కిషన్ లక్ష్మి, రాము, కవిత, సునీత, భోని, కమిలి, దోలి, బుజ్జి, జామున, లక్ష్మమ్మ, ఉమా, మంజు, అమూల్య, కీర్తి తదితరులు పాల్గొని బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతిపై ప్రేమకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో జరుపుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.




