Hyderabad: తృటిలో తప్పిన ఘోర ప్రమాదం!
Hyderabad: ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెను ప్రమాదం తప్పింది. నూతన భవన నిర్మాణ సెంట్రింగ్ రాడ్లు విద్యుత్ వైర్లపై కూలడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
Hyderabad: తృటిలో తప్పిన ఘోర ప్రమాదం!
Hyderabad: ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుతి నగర్ లైబ్రరీ భవనం వద్ద శుక్రవారం తృటిలో ఘోర ప్రమాదం తప్పింది.
నూతనంగా నిర్మిస్తున్న భవనానికి ఉపయోగిస్తున్న భారీ ఐరన్ రాడ్లు ( సెంట్రింగ్ ) ఒక్కసారిగా కూలిపడి సమీపంలోని విద్యుత్ మెయిన్ వైర్లపై పడిపోవడం జరిగింది.
దీంతో స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.
ఆ సమయంలో భవనం లోపల పనిచేస్తున్న కార్మికులను స్థానికులు వెంటనే అప్రమత్తం అయి సురక్షితంగా బయటకు తీసుకరావడం జరిగింది.
దీంతో పెను ప్రమాదం తప్పి వారి ప్రాణాలు దక్కాయి.
ఈ ఘటనతో కొంతసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త, ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి.
ఘటన పై విద్యుత్ శాఖ సిబ్బంది కి సమాచారం అందించిన కూడా పట్టించుకోకపోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story




