Pargi: పరిగిలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టి నుజ్జునుజ్జైన కారు!
Pargi: వికారాబాద్ జిల్లా పరిగిలో ఘోర రోడ్డు ప్రమాదం. లారీని ఢీకొట్టి నుజ్జునుజ్జైన కారు. అదృష్టవశాత్తూ ప్రయాణికులు సురక్షితం.
Pargi: పరిగిలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టి నుజ్జునుజ్జైన కారు!
పరిగి : వికారాబాద్ జిల్లా పరిగి-హైదరాబాద్ ప్రధాన రహదారిపై భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణ శివారులోని భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
పరిగి నుండి హైదరాబాద్ వైపు కారు ,లారీని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో కారు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో, అదుపు తప్పి కారు లారీ వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టింది. వేగంగా ఉన్న కారు అదుపు తప్పి పక్కనే ఉన్న రోడ్డు డివైడర్‌పైకి దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే పరిగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న వారు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాదానికి అసలు కారణాలు ఏమిటి? అతివేగమా? లేక డ్రైవర్ల అప్రమత్తత లోపమా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ తప్పిదం ఉందా లేక కారు డ్రైవర్ చేసిన పొరపాటు వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే అంశాలపై సాక్ష్యాలను సేకరిస్తున్నారు.




