Fire Accident: బాలాపూర్‌లో ఎగిసిపడిన మంటలు.. ప్లాస్టిక్ గోదాం దగ్ధం

Fire Accident: బాలాపూర్ పరిధిలోని కొత్తపేట గార్లెట్ కాలనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ గోదాంలో చెలరేగిన మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేశారు.

RAHUL, MEERPET
Published on: 5 May 2026 4:50 PM IST
Fire Accident
X

Fire Accident: బాలాపూర్‌లో ఎగిసిపడిన మంటలు.. ప్లాస్టిక్ గోదాం దగ్ధం

Fire Accident: బాలాపూర్ పరిధిలోని కొత్తపేట గార్లెట్ కాలనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని బాలాపూర్ సీఐ సుధాకర్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన వివరించారు.

RAHUL, MEERPET

RAHUL, MEERPET

Next Story