Osmania University: మాదిగ ఉపకులాల వనభోజనాలను విజయవంతం చేయాలని జేఏసీ పిలుపు!
Osmania University: నవంబర్ 29న హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో పిడమర్తి రవి ఆధ్వర్యంలో జరిగే మాదిగ ఉపకులాల వనభోజనాలను విజయవంతం చేయాలని ఓయూలో విద్యార్థి జేఏసీ నేతలు కోరారు.
Osmania University: మాదిగ ఉపకులాల వనభోజనాలను విజయవంతం చేయాలని జేఏసీ పిలుపు!
ఉస్మానియా యూనివర్సిటీ: ఈ నెల 29న ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో నిర్వహించనున్న మాదిగ, ఉపకులాల వనభోజనాలు, అలయ్ బలయ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ మాదిగ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు జోగు గణేష్ పిలుపునిచ్చారు.
ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను నాయకులు ఆవిష్కరించారు. నవంబర్ 29న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో వనభోజనాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. మాదిగ, ఉపకులాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బోరెల్లి సురేష్, మాదిగ విద్యార్థి జేఏసీ నాయకుడు దేవరకొండ నరేష్, రాష్ట్ర కన్వీనర్ మీసాల మహేష్, బీఎస్ఎఫ్ ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడు కల్వకుర్తి శ్రీశైలం, ఉపాధ్యక్షుడు ఆరెకంటి శ్రీకాంత్, నాయకులు డి. ఓంకార్, దేవరపాగ నాగరాజు, సతీష్, ఉపేందర్, రాజగోపాల్, మహేందర్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.




