Hyderabad: రేవంత్‌ను గద్దె దించడమే మాల అమరులకు నిజమైన నివాళి
Hyderabad: హైదరాబాద్‌లో మాల అమరుల సంస్మరణ సభ. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా రేవంత్ సర్కార్‌ను ఓడించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ పిలుపు.
Hyderabad: రేవంత్‌ను గద్దె దించడమే మాల అమరులకు నిజమైన నివాళి
హైదరాబాద్: ఎస్సి వర్గీకరణకు వ్యతిరేకంగా 1997 ఆగస్టు 11వ తేదీన ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మాల మహానాడు వ్యవస్థ అధ్యక్షులు పి వి రావ్ పిలుపు మేరకు ఛలో సెక్రటరియేట్ ముట్టడి లో అసువులు బాసిన గోపతోటి నారాయణ, పాణంగి శేషయ్య, రెడ్డి సుదర్శన్ లకు మాల మహానాడు నేడు హైదర్ గూడ ఎన్ ఎస్ ఎస్ ప్రెస్ క్లబ్ లో పి వి రావ్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించరు.
డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ మాట్లాడుతూ మాల లకే కాదు ఎస్సి వర్గీకరణ తో పేద ఎస్సి ల అందరికి అన్యాయం చేసిన రేవంత్ సర్కార్, బాబు సర్కార్ లకు బాబాసాహెబ్ ఇచ్చిన ఓటు అనే ఆయుధం తో ఓడించి తగిన బుద్ధి చెప్పాలని తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ మాల లకు పిలుపు ఇచ్చారు.
నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, డేవిడ్ అలియాస్ అద్దంకి దయాకర్ లు మొదటి నుండి విభీషణ పాత్ర పోసిస్తూ మాల కులాన్ని నాశనం చేస్తున్నారు అందులో భాగంగా నే కొంతమంది వతిరేకులు…మల్లు రవిని, గడ్డం వివేక్ ను కలవడం ధర్నాల పేరుతో మాల ల వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నలు చేస్తున్నారు.
కాబట్టి ఎట్టి పరిస్థితి లో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు మాలలు ఓటు వేయవద్దు అని డాక్టర్ పబ్బతి విజ్ఞప్తి చేశారు. ఒక వేల రేవంత్ సర్కార్ కు ఓటు వేస్తె మనల్ని మనం చంపుకోవడానికి వాళ్ళకు కత్తి ఇచ్చినట్లే అని శ్రీకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు.




