Basheerbagh: రేవంత్ రెడ్డి సర్కార్‌పై మాల సంఘాల జేఏసీ సమర శంఖం!
Basheerbagh: ప్రెస్‌క్లబ్‌లో మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై ఆగస్టు 10, 11 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం జరుపుతామన్నారు.
Basheerbagh: రేవంత్ రెడ్డి సర్కార్‌పై మాల సంఘాల జేఏసీ సమర శంఖం!
బషీర్‌బాగ్: రాష్ట్రంలో అమలవుతున్న ఎస్సీ వర్గీకరణ చట్టం, రోస్టర్ విధానం వల్ల మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని,రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బొంద పెడితేనే మాలలకు న్యాయం జరూగుతుందని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆరోపించింది.
బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో గౌరవాధ్యక్షుడు చెరుకు రాంచందర్, వర్కింగ్ చైర్మన్ మంత్రి నరసింహయ్య, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ బేర బాలకిషన్లతో కలసి జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్
హలో మాల–చలో ఢిల్లీ' కి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను విస్మరించి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేసిందని, 14 ఉద్యోగ నోటిఫికేషన్లతో మాల యువత నష్టపోయారని ఆరోపించారు.
మాల ప్రజాప్రతినిధులు స్పందించాలని, లేకుంటే వారి ఇళ్ల ముందు ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. రోస్టర్ విధానాన్ని నిపుణుల సూచనలతో సవరించాలని డిమాండ్ చేస్తూ, ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద, ఆగస్టు10, 11 తేదీల్లో నిర్వహించనున్న 'హలో మాల–చలో ఢిల్లీ' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్రవ్యాప్తంగా మాల సంఘాలు, విద్యార్థి, యువజన, ఉద్యోగ సంఘాలకు పిలుపునిచ్చారు.




