Hyderabad: ఓయూలో అక్టోబర్ 4న 'మాల విద్యార్థి, నిరుద్యోగుల సభ'!
Hyderabad: ఉస్మానియా యూనివర్సిటీలో అక్టోబర్ 4న 'మాల విద్యార్థి, నిరుద్యోగుల సభ'.. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద పోస్టర్ ఆవిష్కరణ.
Hyderabad: ఓయూలో అక్టోబర్ 4న 'మాల విద్యార్థి, నిరుద్యోగుల సభ'!
Hyderabad: మాల విద్యార్థులు, నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయం, రోస్టర్ విధానంపై అవగాహన కల్పించడంతో పాటు సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 4న ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో ‘మాల విద్యార్థి, నిరుద్యోగుల సభ’ నిర్వహించనున్నట్లు మాల స్టూడెంట్స్ జేఏసీ, ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్ (AMSA), ఐక్య విద్యార్థి సంఘాల ప్రతినిధులు తెలిపారు. సభకు సంబంధించిన పోస్టర్‌ను శనివారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట ఆవిష్కరించారు.
హయ్యర్ ఎడ్యుకేషన్ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రొఫెసర్ మాయాదేవి ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ఈ వారు మాట్లాడుతూ.. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత మాల సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఉపాధి అవకాశాలను కోల్పోతున్నారని ఆరోపించారు. గత రెండేళ్లుగా అమలవుతున్న రోస్టర్ విధానం వల్ల తమ వర్గానికి నష్టం జరుగుతోందని పేర్కొన్నారు.
ఇప్పటివరకు వెలువడిన 25 నోటిఫికేషన్లలో సుమారు 19 నోటిఫికేషన్లలో మాల వర్గానికి ఒక్క పోస్టు కూడా కేటాయించలేదని ఆరోపించారు. రిజర్వేషన్ ఫలాలు సక్రమంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాల సామాజిక వర్గ సమస్యలపై ఉద్యోగులు, మేధావులు, విద్యార్థులు, ప్రజాసంఘాల ప్రతినిధులతో కలిసి సభ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అక్టోబర్ 4న ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే సభకు రాష్ట్రంలోని విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు, మాల సంఘాల నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాల స్టూడెంట్స్ జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్, అంసా ఓయూ అధ్యక్షుడు నామ సైదులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో
చెరకు రాంచంద్రం, బేర బాలకిషన్, గోపోజు రమేష్, ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, సత్యం, మాస శేఖర్, రాంబాబు, అడ్వకేట్ నర్సింగం, ప్రణయ్ సేపూరి, పసరగొండ కిషోర్, కలకోటి ఉదయ్, దాసరి రవి, పండుగ భానుతేజ, బత్తుల రమేష్, బత్తుల దిలీప్, ఏనాపోతుల అరుణ్‌కుమార్, కొప్పుల అర్జున్, మద్దెల రాజు, అడ్వకేట్ బాలరాజు, శంకర్, గౌతమ్, సక్కి గంగాధర్, భాస్కర్, అనీష్ వర్మ, కే. నరేష్, అంజిబాబు, వేణు సంగదీప్, ఓయూ, వివిధ యూనివర్సిటీల విద్యార్థి నాయకులు, జిల్లాల బాధ్యులు, మాల సంఘాలు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.




