Malakpet: మలక్‌పేటలో హోటళ్లపై పోలీసుల దాడులు.. యాజమాన్యాలకు స్ట్రాంగ్ వార్నింగ్!
Malakpet: హైదరాబాద్ మలక్‌పేటలో 13 లాడ్జీలు, హోటళ్లలో ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు.
Malakpet: మలక్‌పేటలో హోటళ్లపై పోలీసుల దాడులు.. యాజమాన్యాలకు స్ట్రాంగ్ వార్నింగ్!
Malakpet: మలక్‌పేట్ డివిజన్ పరిధిలోని 13 లాడ్జీలు, హోటళ్లలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథుల ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు పత్రాలు, గెస్ట్ రిజిస్టర్లు, సీసీటీవీ కెమెరాల పనితీరు మరియు ఇతర తప్పనిసరి పత్రాలను పరిశీలించారు.
హోటల్, లాడ్జి యాజమాన్యాలు అతిథుల పూర్తి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, సీసీటీవీ వ్యవస్థలను నిరంతరం పనిచేసేలా నిర్వహించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణలో భాగంగా ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
మలక్‌పేట్ ఏసీపీ శ్రీ ఎల్. రాజా వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మలక్‌పేట్ డివిజన్ పరిధిలోని 13 లాడ్జీలు, హోటళ్లలో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.




