Hyderabad: భారతీయ యువతకు మలేషియాలో విద్యా, ఉపాధి అవకాశాలు

Hyderabad: హైదరాబాద్‌లో మలేషియా పినాంగ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం జగ్‌దీప్‌ సింగ్‌ డీఈవో పర్యటించారు.

RAJESH,	WEST ZONE
Published on: 15 Jun 2026 2:38 PM IST
Hyderabad
X

Hyderabad: భారతీయ యువతకు మలేషియాలో విద్యా, ఉపాధి అవకాశాలు

హైదరాబాద్: ఆధునికి సాంకేతిక పరస్పర సహకారంతో ఎంతో మందికి విద్యా, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మలేషియాలోని పినాంగ్‌ రాష్ట్ర డిప్యూటీ సీఎం జగ్‌దీప్‌ సింగ్‌ డీఈవో అన్నారు. బంజారాహిల్స్‌లోని ది లీలా హోటల్‌లో బైకస్, వర్ధమాన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్, హెల్త్‌కేర్‌ ట్రయాంగిల్‌ సంస్థలతో ఆయన అవగాహన పరస్పర అవగాహన ఒప్పందాన్ని చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఒప్పందాల వల్ల పినాంగ్‌లో భారతీయ యువతకు విద్యా, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అదే విధంగా ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్, డేటా సైన్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్, సైబర్‌ సెక్యూరిటీ అధునాతిన సాంకేతికతలలో పరస్పర సహకారం ఎంతో మేలు చేస్తోందని అన్నారు.

ఇప్పటికీ ప్రాంతీయ ఇన్నోవేషన్‌ హబ్‌గా పినాంగ్‌కు పేరుందని ఈ ఒప్పందాలతో అది మరింత బలోపేతం అవుతుందని అన్నారు. పినాంగ్‌లో అభివృద్ధి చెందుతున్న వైద్య పర్యాటక రంగానికి హెల్త్‌ కేర్‌ ఐటీ ఎలక్ట్రానికల్‌ మెడికల్‌ రికార్డులు, డిజిటల్‌ హెల్త్‌సొల్యూషన్స్‌ సహకారం వల్ల హెల్త్‌ టూరిజం అభివృద్ధి చెందుతుందని అన్నారు.

హైదరాబాద్‌కు చెందిన సాంకేతిక, ఆరోగ్య సంరక్షణ కంపెనీలు తమ వ్యాపారాలను సులభంగా పినాంగ్‌లో విస్తరించుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. అంతే కాకుండా ఉమ్మడి పరిశోధనలు, ఇన్నోవేషన్‌ ప్రోగ్రామ్‌లు, ఇంటర్న్‌షిప్‌లు నిర్వహించుకోవచ్చునని అన్నారు.

ఈ కార్యక్రమంలో బైకస్‌ సంస్థ ప్రతినిధి డాక్టర్‌ నాగేశ్వర్‌రావు పులిపాటి, వర్ధమాన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ ప్రతినిధి డాక్టర్‌ విజయేందర్‌రెడ్డి, హెల్త్‌కేర్‌ ట్రయాంగిల్‌ చైర్మన్‌ సురేష్‌ వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story