Malkajgiri: ఘనంగా శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ముగింపు!

Malkajgiri: మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ముగిశాయి. చక్రస్నానం, పుష్పయాగం పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Bodike Manohar, Malkajgiri
Published on: 25 Aug 2026 10:58 PM IST
Malkajgiri
X

Malkajgiri: ఘనంగా శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ముగింపు!

మల్కాజిగిరి: ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం సుదర్శన హోమం, మహాపూర్ణాహుతి, చక్రస్నానం, వసంతోత్సవం, మహాకుంభ సంప్రోక్షణ, పుష్పయాగం, ధ్వజావరోహణం, డోలోత్సవం తదితర కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన సుదర్శన హోమం, మహాపూర్ణాహుతి కార్యక్రమాల్లో మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్థానికులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను ,స్వామివారి ఆశీస్సులు పొందారు.అనంతరం చక్రస్నానం, వసంతోత్సవం, మహాకుంభ సంప్రోక్షణ, పుష్పయాగం, ధ్వజావరోహణం, డోలోత్సవం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబాయి వెంకటరమణాచార్యులు మాట్లాడుతూ స్వామివారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. భక్తులపై స్వామివారి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. కార్యక్రమాల్లో ఆలయ అధికారులు ఏ బి రవీందర్ రెడ్డి,అర్చకులు తులసి వెంకటరమణచార్యులు, సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri

Next Story