Malkajgiri: కాప్రా సర్కిల్‌లో ఘనంగా బోనాల ఉత్సవాలు
Malkajgiri: మల్కాజిగిరి కార్పొరేషన్ కాప్రా సర్కిల్ కార్యాలయంలో అంగరంగ వైభవంగా ఆషాఢమాస బోనాల వేడుకలు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన డీసీ రవీంద్ర సాగర్.
Malkajgiri: కాప్రా సర్కిల్‌లో ఘనంగా బోనాల ఉత్సవాలు
మల్కాజిగిరి: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కాప్రా సర్కిల్ కార్యాలయంలో ఆషాఢమాసం బోనాల పండుగ సందర్భంగా కాప్రా సర్కిల్, నాచారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ల ఆధ్వర్యంలో అన్నివిభాగాల మున్సిపల్ ఉద్యోగులు కలిసి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ ఆవరణలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవీంద్ర సాగర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు బోనమెత్తి నాట్యమాడి ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా పోతరాజులు కాలికి గజ్జెకట్టి వీరగోలలతో మహంకాళి అమ్మవారి భక్తిగీతాలకు నృత్యం చేసి చిందులేశారు.
ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్, పారిశుధ్య తదితర అన్ని విభాగాల ఉద్యోగులు అమ్మవారి పాటలకు భాజాభజంత్రీల మధ్య డప్పు చప్పుళ్లకు తగ్గట్లు డ్యాన్సులు చేసి సంబరాలు జరుపుకున్నారు. అమ్మవారికి బోనాలు సర్పించిన అనంతరం అందరికీ అన్న ప్రసాద వితరణ చేపట్టారు.




