Malkajgiri: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడతాం!

Malkajgiri: కాంగ్రెస్ హామీలు అమలు చేయాలని మల్కాజిగిరి ప్రజావాణిలో జోనల్ కమిషనర్‌కు బీఆర్‌ఎస్ నేతల వినతిపత్రం. మల్కాజిగిరి బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన.

Bodike Manohar, Malkajgiri
Published on: 7 Sept 2026 7:21 PM IST
Malkajgiri
X

Malkajgiri: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడతాం!

Malkajgiri: ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని మల్కాజిగిరి బీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాలతో సోమవారం నియోజకవర్గంలోని వివిధ డివిజన్లకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయానికి చేరుకుని నిరసన కార్యక్రమం నిర్వహించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలనలో ఇచ్చిన 420 హామీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ మల్కాజిగిరి ప్రజావాణిలో జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కరించడంతో పాటు వీధి దీపాలు ఏర్పాటు చేయాలని,బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలని, అర్హులైన వృద్ధులకు పింఛన్లు అందించాలని కోరారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న ఇతర సమస్యలను కూడా తక్షణమే పరిష్కరించాలని అధికారులను కోరినట్లు నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జగదీశ్ గౌడ్,మేకల సునీత రాము యాదవ్, బీఆర్‌ఎస్ నాయకులు జేఏసీ వెంకన్న, రాము యాదవ్, చిన్న యాదవ్, టీఆర్‌ఎస్‌వీ నర్సింగ్, ప్రభాకర్ గౌడ్, కేబుల్ రమేష్, కిట్టు, ఉపేందర్, అనితలక్ష్మి ఆనంద్‌తో పాటు బీఆర్‌ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri

Next Story