Malkajgiri: జలమండలి కార్మికుల సమస్యలపై ఎంపీ ఈటల రాజేందర్‌కు వినతిపత్రం

Malkajgiri: కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌కేవీ నాయకులు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

Bodike Manohar, Malkajgiri
Published on: 27 Aug 2026 6:29 PM IST
Malkajgiri
X

Malkajgiri: జలమండలి కార్మికుల సమస్యలపై ఎంపీ ఈటల రాజేందర్‌కు వినతిపత్రం

మల్కాజ్గిరి: జలమండలిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీఆర్‌ఎస్‌కేవీ మల్కాజ్‌గిరి అధ్యక్షుడు కుమారస్వామి గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కార్మిక సంఘం నాయకులతో కలిసి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా జలమండలి కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా కేటగిరీ–2 కార్మికుల సమస్యలతో పాటు విధి నిర్వహణలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌కేవీ నాయకులు అశోక్, ప్రసాద్,ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri

Next Story