Malkajgiri: బీఆర్ఎస్ నేత జక్కుల కిరణ్‌కుమార్‌పై అట్రాసిటీ కేసు నమోదు
Malkajgiri: మల్కాజిగిరిలో బీఆర్ఎస్ నేత జక్కుల కిరణ్‌కుమార్‌పై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Malkajgiri: బీఆర్ఎస్ నేత జక్కుల కిరణ్‌కుమార్‌పై అట్రాసిటీ కేసు నమోదు
మల్కాజిగిరి: బీఆర్‌ఎస్ నాయకుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే అనుచరుడు జక్కుల కిరణ్‌కుమార్ ముదిరాజ్‌పై నేరెడ్మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్యాచారం, దాడి, బెదిరింపులతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది.
బాధితురాలు ఫిర్యాదు ప్రకారం.. కిరణ్‌కుమార్ తనకు పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి తనతో సన్నిహితంగా మెలిగాడని మహిళ ఆరోపించారు. వ్యాపారంలో భాగస్వామ్యం కోసం తాను సుమారు రూ.30 లక్షలు సమకూర్చినట్లు తెలిపారు. అనంతరం తనపై, తన 10 ఏళ్ల కుమారుడిపై దాడి చేశారని, కులం పేరుతో దూషించి అవమానించారని ఆరోపించారు.
తన ఫొటోలను మార్ఫింగ్ చేసి పరువు తీసే ప్రయత్నం చేశారని, హైదరాబాద్ విడిచి వెళ్లేందుకు రూ.3 లక్షలు ఇస్తామని, లేకపోతే చంపేస్తామని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కిరణ్‌కుమార్ తనను హత్య చేసేందుకు రూ.10 లక్షలు ఖర్చు చేయడానికైనా సిద్ధమని బెదిరించినట్లు ఆరోపించారు.
మహిళ ఫిర్యాదు మేరకు నేరెడ్మెట్ పోలీసులు క్రైమ్ నంబర్ 751/2026 నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. BNS సెక్షన్లు 69, 74, 79, 115(2), 351(2)తో పాటు SC/ST (POA) Act-2015లోని సెక్షన్ 3(2)(v) కింద కేసు నమోదు చేసినట్లు నేరేడ్మెట్ పోలీసులు తెలిపారు. ఈ విషయం మల్కాజిగిరి ప్రచార మాధ్యమాలలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అనుచరుడి పై కేసు నమోదు అనే విషయం చెక్కర్లు కొడుతుంది.




