LB Nagar: సరూర్ నగర్ వీధుల్లో అధికారుల సందడి.. అభివృద్ధి పనుల తనిఖీ!

LB Nagar: సరూర్ నగర్ సర్కిల్ పరిధిలో మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, జెడ్‌సీ వికాస్ మహతో పర్యటన.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 9 May 2026 4:51 PM IST
LB Nagar
X

LB Nagar: సరూర్ నగర్ వీధుల్లో అధికారుల సందడి.. అభివృద్ధి పనుల తనిఖీ!

ఎల్బీనగర్: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ టీ. వినయ్ కృష్ణారెడ్డి, ఐఏఎస్ గారు, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ శ్రీ వికాస్ మహతొ, ఐఏఎస్ గారు, సరూర్ నగర్ సర్కిల్ పరిధిలోని వివిధ వార్డులలో పర్యటించి శానిటేషన్, అభివృద్ధి పనులు పరిశీలించడం జరిగింది మరియు వీఎం హోమ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి వీఎం హోమ్స్ నుండి కోతపేట్ జంక్షన్ వరకు నిర్వహించిన 2K రన్‌లో పాల్గొన్నారు.

అనంతరం డీసీ గారు, పీఓ, డీఈ, డీఈ (ఎస్‌డబ్ల్యూఎం), పారిశుధ్య సిబ్బంది మరియు ఇతర అధికారులతో కలిసి చైతన్యపురి మరియు రాఘవేంద్ర కాలనీలలోని చైతన్యపురి నాలా డీసిల్టింగ్ పనులను పరిశీలించారు. అలాగే కమిషనర్ గారు క్రాంతి నగర్ ఆర్‌డబ్ల్యూఏ మరియు జనప్రియ కాలనీ రెసిడెంట్స్ అసోసియేషన్ సభ్యులతో స్వీయ గణన (Self Enumeration) మరియు స్వచ్ఛ సర్వేక్షణ్ పౌరుల అభిప్రాయ సేకరణ (Citizen Feedback) విషయాలపై పరస్పరం చర్చించారు. తదుపరి, జెడ్‌సీ గారు మరియు డీసీ గారు శ్రీంగేరి కాలనీలోని ఎస్‌హెచ్‌జీ సభ్యులతో కూడా ఇదే అంశాలపై సమావేశమయ్యారు.

ఈ మూడు కార్యక్రమాల్లో స్థానిక నివాసితులు ఉత్సాహంగా పాల్గొని స్వీయ గణన పూర్తి చేసి, స్వచ్ఛ సర్వేక్షణ్‌కు సంబంధించిన తమ అభిప్రాయాలను అందించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story