Malkajgiri: మల్కాజిగిరిలో సీఈసీ దిష్టిబొమ్మ దగ్ధం: మైనంపల్లి
Malkajgiri: ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)లో ఓట్ల తొలగింపును నిరసిస్తూ మల్కాజిగిరిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
Malkajgiri: మల్కాజిగిరిలో సీఈసీ దిష్టిబొమ్మ దగ్ధం: మైనంపల్లి
మల్కాజిగిరి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం మల్కాజిగిరిలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కార్యక్రమంలో పాల్గొన్నారు.
మల్కాజిగిరిలో 2.31 లక్షలకు పైగా ఓట్లు మాయమయ్యాయని మైనంపల్లి ఆరోపించారు. ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత పాటించాలని, అర్హులైన ఓటర్ల పేర్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే మార్చాలని, ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ఎన్నికల సంఘం బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ఇప్పటికే పెద్ద సంఖ్యలో నోటీసులు జారీ కావడం, వాటిలో గణనీయమైన సంఖ్య పెండింగ్‌లో ఉండటంపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్ జితేంద్రనాథ్ మల్కాజిగిరి ఇంచార్జ్ లక్ష్మీకాంతరెడ్డి బి బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ బి కే శ్రీనివాస్,గుండా నిరంజన్, జిఎన్వి సతీష్ కుమార్,పిట్టల శ్రీనివాస్,రాందాస్ సంతోష్ ముదిరాజ్, డివిజన్ అధ్యక్షులు జీడి సంపత్ గౌడ్,వైనాల ప్రవీణ్, సత్యమూర్తి,యూసుఫ్ భాయ్,పిట్టల నాగరాజు, రాఘవన్,శ్రీకాంత్ ముదిరాజ్,వినోద్ యాదవ్,లక్ష్మీ,ఇందిర ప్రియదర్శిని ప్రభా,ఆశా, శారద,పుష్ప లత, కనకలక్ష్మి, సత్యనారాయణ,ఫరీద్, సయ్యద్ మబ్బు,ఫరూక్,మంద భాస్కర్, సురేష్ సింగ్,కన్నె మల్ల నాగరాజు,బ్రహ్మయ్య, రామక్రిష్ణ,వెంకన్న,జీడి చరణ్ జిత్ గౌడ్,చుంకూ శ్రీనివాస్, ధరన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు




