Malkajgiri: కాంగ్రెస్ సంబరాలు 1000 రోజుల పాలనపై మై నంపల్లి హర్షం!

Malkajgiri: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మల్కాజిగిరిలో కాంగ్రెస్ సంబరాలు.

Bodike Manohar, Malkajgiri
Published on: 2 Sept 2026 5:51 PM IST
Malkajgiri
X

Malkajgiri: కాంగ్రెస్ సంబరాలు 1000 రోజుల పాలనపై మై నంపల్లి హర్షం!  

Malkajgiri: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మల్కాజిగిరిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మల్కాజిగిరి అసెంబ్లీ అబ్జర్వర్ షమీర్ కౌశల్ హాజరయ్యారు. కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు బాణసంచా కాల్చి, కేక్ కట్ చేసి,మిఠాయిలు పంచుకున్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు, హామీల్లో లేని పలు సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ,అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూ విమర్శలకు సమాధానం చెబుతామని స్పష్టం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ప్రేమ కుమార్,బీ బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్,బి కే శ్రీనివాస్, ప్రసాద్,సతీష్ కుమార్, పిట్టల శ్రీనివాస్,డివిజన్ అధ్యక్షులు వినోద్ యాదవ్,ప్రవీణ్,సత్య మూర్తి,పీట్ల నాగరాజ్,శ్రీకాంత్,యూసుఫ్,రాఘవన్,లక్ష్మీ, బాబు సత్యనారాయణ, సీనియర్ నాయకులు మహేందర్ గౌడ్,గౌస్ భాయ్,కొండా గౌడ్,రవీందర్ రెడ్డి,నగేష్ గౌడ్,రాందాస్ సంతోష్ ముదిరాజ్, సంజయ్,ఆశ,శారద,భూదేవి,ఇంద్ర, అసిమ్,రాజు,చారి అగోండా,కుమార్ గౌడ్,పార్థ సారథి,రవీందర్, వినయ్ నిరుగొండ,రాజేష్ లింగం,రామచందర్, వెంకన్న సిరిగిరీ రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri