Malkajgiri: ఓటర్లకు న్యాయం జరిగే వరకు పోరాటం: లక్ష్మీకాంత్ రెడ్డి!

Malkajgiri: ఓట్ల తొలగింపును నిరసిస్తూ మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌లో కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని లక్ష్మీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Bodike Manohar, Malkajgiri
Published on: 12 Oct 2026 8:08 PM IST
Malkajgiri
X

Malkajgiri: ఓటర్లకు న్యాయం జరిగే వరకు పోరాటం: లక్ష్మీకాంత్ రెడ్డి!

మల్కాజిగిరి, అక్టోబరు 12: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో ఓట్ల తొలగింపును నిరసిస్తూ మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ లక్ష్మీకాంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఓట్ల తొలగింపుపై తమ నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. ఓట్ల తొలగింపునకు గురైన ప్రతి ఓటరుకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, వాటికి బాధ్యత వహించి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు నిరసనలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ పిలుపు మేరకు మధ్యాహ్నం 3 గంటలకు దేశవ్యాప్తంగా ప్రజలు ఎక్కడివారు అక్కడే జాతీయ జెండాలు, పార్టీ జెండాలు, కాంగ్రెస్ కండువాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోరినట్లు వివరించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు, ఓటు హక్కు కాపాడేందుకు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఉద్యమంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

బుధవారం గాంధీ పార్కులో నిరసన

మల్కాజిగిరి నియోజకవర్గ స్థాయిలో బుధవారం గాంధీ పార్కులో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బి-బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, గుండా నిరంజన్, జీఎన్‌వీ సతీష్ కుమార్, పిట్టల శ్రీనివాస్, ఏకే మురుగేష్, డివిజన్ అధ్యక్షులు జీడి సంపత్ గౌడ్, వినోద్ యాదవ్, సత్యమూర్తి, వైనాల ప్రవీణ్, యూసుఫ్ భాయ్, పిట్టల నాగరాజు, శ్రీకాంత్ ముదిరాజ్, రాందాస్, సంతోష్ ముదిరాజ్, చెన్నారెడ్డి, పార్థు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీడి చరణ్ జిత్ గౌడ్, ఆశా, చిత్ర, గోకుల్, శారద, పుష్పలత, కనకలక్ష్మి, లక్ష్మి, సయ్యద్ మబ్బు, బ్రహ్మయ్య, రామకృష్ణ, రాము, చుంకు శ్రీనివాస్, షకీల్ తదితరులు పాల్గొన్నారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri