Malkajgiri: మల్కాజిగిరి: కూలీ డబ్బుల వివాదం.. దంపతులపై దాడి
Malkajgiri: మల్కాజిగిరి నరసింహరెడ్డి నగర్లో కూలీ డబ్బుల వివాదంలో దంపతులపై స్క్రూడ్రైవర్లతో దాడి చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Malkajgiri: మల్కాజిగిరి: కూలీ డబ్బుల వివాదం.. దంపతులపై దాడి
మల్కాజిగిరి: కూలీ డబ్బుల విషయంలో తలెత్తిన వివాదం దంపతులపై దాడికి దారితీసింది. నరసింహరెడ్డి నగర్లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. జారుపుల హరిచందర్ ఇంటి వద్ద గతంలో టైల్స్ పని చేసిన శివ (21), అనిల్ (25) సెప్టెంబరు 30న రాత్రి 11 గంటల సమయంలో అక్కడికి వచ్చారు. కూలీ డబ్బుల విషయంలో హరిచందర్‌తో గొడవపడి, ఇద్దరూ కలిసి స్క్రూడ్రైవర్లతో హరిచందర్, ఆయన భార్యపై దాడి చేశారు. ఈ దాడిలో దంపతులకు తలకు గాయాలయ్యాయి.
బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు శివ, అనిల్‌ను అదుపులోకి తీసుకుని గురువారం రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.




