LB Nagar: 15 రోజుల్లో 66 మంది అరెస్ట్.. 10 మందిపై క్రిమినల్ కేసులు!
LB Nagar: మహిళల భద్రత మా ప్రథమ ప్రాధాన్యత అని మల్కాజిగిరి సీపీ బి. సుమతి స్పష్టం చేశారు.
LB Nagar: 15 రోజుల్లో 66 మంది అరెస్ట్.. 10 మందిపై క్రిమినల్ కేసులు!
ఎల్బీనగర్: మహిళల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి పేర్కొన్నారు. పక్షం రోజుల్లో మహిళలను వేధిస్తున్న 66 మంది ఆకతాయిలను అరెస్టు చేశామని తెలిపారు. వారిలో 10 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మిగిలిన వారిపై పెట్టి కేసులు పెట్టి శుక్రవారం ఎల్బీనగర్లోని సీపీ క్యాంపు కార్యాలయం వద్ద ఉమెన్ సేఫ్టీ మింగ్ ఆధ్వర్యంలో కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సె లింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీపీ పలు కేసుల వివరాలు వెల్లడించారు.
ఓ విద్యార్థినికి సమీప బంధువైన యువకుడు పరిచయమయ్యాడు. ఆమె నమ్మకాన్ని చూరగొని తరచూ ఆమెతో ఫోనులో మాట్లాడసాగాడు. ఒక సందర్భంగా ఇద్దరూ కలిసి బయటికి వెళ్లారు. ఆమెను మత్తులోకి, దించి అత్యాచారం చేశాడు. ఆ వీడియోలు బయట పెడతానని.. ఆ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ భయపెట్టాడు. వాటిని తొలగించాలంటే తన కోరిక తీర్చాలంటూ పలుమార్లు ఆమెను రప్పించాడు. అతని వేధిం పులు భరించలేని ఆ యువతి షీటీమ్స్ ను ఆశ్రయించింది. పోలీసులు క్రిమి నల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఓ వ్యక్తి తన బంధువు లైన యువతులకు అసభ్యకరమైన పోస్టులు ఆన్లైన్ ద్వారా చేస్తూ వేదిం పులకు గురిచేస్తున్నాడు. వారి ఫొటోలను పెట్టి కించపరిచేలా పోస్టులు పెడుతూ ఇబ్బందులు సృష్టిస్తున్నాడు. దీంతో ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యా దుతో అతనిపై క్రిమినల్ కేసు నమోదుచేశారు. ఓ యువతికి మ్యాట్రి మోని సైట్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తితో కొన్నాళ్లు సహజీవనం కొన సాగింది. అతని ప్రవర్తనలో మార్పు రావడంతో ఆమె దూరంగా ఉంటోంది. దీంతో తనతో మాట్లాడాలని.. పెళ్లిచేసుకోవాలని... మరొకరిని పెళ్లి చేసుకుంటే ఊరుకునేది లేదంటూ తాము కలిసి ఉన్న ఫొటోలు, మెసే జ్ు అందరికీ పంపుతానంటూ బెదిరించాడు. బాధితురాలు షీటీమ్స్ ను సంప్రదించడంతో కేసు నమోదైంది.
తన భార్య పక్కింటి మహిళతో కలిసి సాయంత్రం నడకకు వెళ్లినప్పుడు ఇద్దరు గుర్తుతెలియని దుండగులు ఆమె వెంటపడి వేధిస్తున్నారని.. కర్రతో కొడుతూ భయ పెడుతున్నారని ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో షీటీమ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఇద్దరు నిందితులను అరెస్టుచేసి రిమాండుకు తరలించారు. ఎంబీఏ చదువుతున్న ఓ యువతికి ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఆమెను ప్రేమిస్తున్నానని తెలపడంతో ఆమె సరేనంది.
కొన్నాళ్లు వీరి పరిచయం కొనసాగింది. కుటుంబ సమస్యల కారణంగా అత నికి దూరంగా ఉంటోంది. ఈ విషయం అతడికి తెలిపినా వినలేదు. తరచూ పోన్లు చేస్తూ వేధించాడు. తనను పెళ్లిచేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటా నని బెదిరించాడు. అతను చనిపోయినట్లు తప్పుడు సమాచారాన్ని ఆమె పని చేస్తున్న ప్రదేశాల్లో ప్రచారం చేసి తీవ్ర మానసిక క్షోభకు గురిచేశాడు. బాధితు రాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీపీ మాట్లా డుతూ, మహిళలు వేధింపులకు గురైతే మల్కాజిగిరి వాట్సాప్ నంబరు 87126 62111లో షీటీమ్స్ కు సమాచారం అందించాలని సూచించారు.




