Vanasthalipuram: 'సైబర్ జాగరూకత'.. ప్రజలు, విద్యార్థులకు అవగాహన!
Vanasthalipuram: మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఆదేశాల మేరకు వనస్థలిపురంలో 'సైబర్ జాగరూకత' అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
Vanasthalipuram: 'సైబర్ జాగరూకత'.. ప్రజలు, విద్యార్థులకు అవగాహన!
వనస్థలిపురం: సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయడమే లక్ష్యంగా మల్కాజిగిరి కమిషనరేట్ ఆధ్వర్యంలో బుధవారం విస్తృత సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మల్కాజ్ గిరి పోలీస్ కమిషనర్ B. Sumathi ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ స్టేషన్ అధికారులు ప్రజలు, విద్యార్థులకు "సైబర్ జాగూరుకత" కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు.
ఉదయం ఇంజాపూర్‌లోని సంజీవని వనం పార్క్‌లో 50 మంది, ఎన్జీవోస్ కాలనీలోని వివేకానంద పార్క్‌లో 40 మంది, ఆటోనగర్‌లోని డీర్ పార్క్‌లో 50 మందితో సమావేశాలు నిర్వహించి సైబర్ నేరాలపై చైతన్యం కల్పించారు. అనంతరం సాగర్ కాంప్లెక్స్ సమీపంలోని కృష్ణవేణి కాలేజీలో 300 మంది విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు సైబర్ నేరాల స్వరూపాన్ని వివరించారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, జాబ్ ఫ్రాడ్స్, ఓటీపీ మోసాలు, డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాలు, ఫోటో మార్ఫింగ్, డేటా హ్యాకింగ్, సోషల్ మీడియా మోసాలు, ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలు వంటి నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల జరిగిన కొన్ని సైబర్ మోసాల కేసులను ఉదాహరణగా వివరిస్తూ, బాధితులు ఆలస్యం చేయకుండా వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేస్తే డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని తెలిపారు.
సైబర్ ప్రపంచంలో అప్రమత్తతే అతిపెద్ద రక్షణ అని, తెలియని లింకులు క్లిక్ చేయడం, ఓటీపీలు, బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలోవనస్థలిపురం ACP Kasi Reddy, cyber crime acp shiva శంకర్, వనస్థలిపురం సీఐ రవి బాబు, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్లు కృష్ణంరాజు, నాగచారి, వనస్థలిపురం ఎస్ఐలు గిరీష్, నాగరాజు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.




