Secunderabad: శ్రీచైతన్య స్కూల్ దాడి ఘటన: ప్రిన్సిపల్, వార్డెన్‌ల అరెస్ట్!

Secunderabad: జవహర్ నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లో విద్యార్థిపై దాడి ఘటనపై మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.

Srikanth, Secunderabad
Published on: 11 Aug 2026 6:52 PM IST
Secunderabad
X

Secunderabad: శ్రీచైతన్య స్కూల్ దాడి ఘటన: ప్రిన్సిపల్, వార్డెన్‌ల అరెస్ట్!

సికింద్రాబాద్: ఈ నెల 7 వ తేదీన కుటుంబ సభ్యులపై దుర్భాషలాడటము తో విద్యార్థుల మధ్య గొడవ జరిగిందని, దానితో ఒక విద్యార్థి పై కొంతమంది విద్యార్థులు విచక్షణ రహితంగా దాడి చేశారని మల్కాజిగిరి డీసీపీ తెలిపారు.

తొమ్మిది విద్యార్థుల తో పాటు బాధితుడి తల్లికి తప్పుడు సమాచారం ఇవ్వడంతో స్కూల్ ప్రిన్సిపల్ జె మనోజ్ కుమార్, హాస్టల్ వార్డెన్ ఎం బాబు, హాస్టల్ ఇంచార్జి జె ఆకాష్ పై కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు డీసీపీ తెలిపారు.

ప్రతి విద్యా సంస్థల్లో సీసీ కెమెరా లు ఏర్పాటు చెసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యందే అన్నారు... స్కూల్ ఆవరణలో ఎలాంటి గొడవలు జరిగిన యాజమాన్యం బాధ్యత వహించాల్సి వస్తుందని డీసీపీ శ్రీధర్ తెలిపారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story