Malkajgiri: 2.360 కేజీల గంజాయి పట్టివేత – ఇద్దరు నిందితుల అరెస్ట్!

Malkajgiri: ఒరిస్సా బరంపూర్ నుంచి అల్వాల్ మీదుగా తుర్కపల్లికి రవాణా చేస్తున్న 2.360 కేజీల గంజాయిని మల్కాజిగిరి ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ స్వాధీనం చేసుకుంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 24 July 2026 8:55 PM IST
Malkajgiri
X

Malkajgiri: 2.360 కేజీల గంజాయి పట్టివేత – ఇద్దరు నిందితుల అరెస్ట్!

Malkajgiri: ఒరిస్సా బరంపూర్ నుంచి 2.360 కేజీల గంజాయిని తుర్కపల్లికి తీసుక వెలుతున్న ఇద్దరినీ మల్కాజిగిరి ఎన్‌ఫోర్స్ మెంట్ టీమ్ సీఐ కోటమ్మ, ఎస్సై ఆఖిల్ సిబ్బంది పట్టుకున్నారు.

బరంపూర్ నుంచి తీసుక వచ్చిన గంజాయిని బైక్‌పై లోతుకుంట నుంచి హకీంపేట్ రోడ్డులో వెలుతుండగా పక్కా సమాచారం మేరకు పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న బ్యా గ్‌లో ఉన్న 2.360 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో టి. రామకృష్ణ కృష్ణ (25) ఏ. అజయ్ (26)లను అరెస్టు చేసి గంజాయితో పాటు నిందితులను అల్వాల్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు. మరో కేసులో ఎస్టీఎఫ్ బీ టీం సీఐ బిక్షారెడ్డి సిబ్బంది లాల్‌గూడలో సూర్య అనే వ్యక్తి 121 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడని, గంజాయిని సికింద్రాబాద్ ఎకైంసజ్ స్టేషన్‌లో అప్పగించి నట్లు సీఐ తెలిపారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story