Malkajgiri: రూ.11 లక్షలతో స్మశాన వాటిక అభివృద్ధి పనులకు శంకుస్థాపన!

Malkajgiri: మల్కాజిగిరి కీసర సర్కిల్ వెంకటేశ్వర కాలనీలో రూ.11 లక్షలతో హిందూ స్మశాన వాటిక అభివృద్ధి పనులకు కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ శంకుస్థాపన.

PURENDAR, ALWAL
Published on: 28 Oct 2026 7:29 PM IST
Malkajgiri
X

Malkajgiri: రూ.11 లక్షలతో స్మశాన వాటిక అభివృద్ధి పనులకు శంకుస్థాపన!

మల్కాజిగిరి: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కీసర సర్కిల్ పరిధిలోని చంద్రపురి కాలనీ డివిజన్ వెంకటేశ్వర కాలనీలో హిందూ స్మశాన వాటిక అభివృద్ధి పనులకు రూ.11 లక్షల నిధులతో డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ శంకుస్థాపన చేశారు. మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ బింగి లావణ్య సతీష్ గౌడ్‌లతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ.. హిందూ స్మశాన వాటికను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు మరిన్ని ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గొడుగు వేణు, సీనియర్ నాయకులు మందుల రజిత గోపాల్, కారింగుల రాజు గౌడ్, ఉపాధ్యక్షులు చిట్టి బాబు, ప్రధాన కార్యదర్శి బూడిద వెంకటేష్, జోగి సునీత, మాధవరెడ్డి, కోశాధికారి అశోక్ గుప్తా, ఎస్సీ సెల్ అధ్యక్షులు రాహుల్ కదం, నాయకులు సాయి కృష్ణ (మిట్టు), బబ్లూ ముదిరాజ్, భాస్కర్ గౌడ్, కిషోర్, మంజుల, రవి, శ్రీరామ్, ఇరగదిండ్ల రాజు, యాదయ్య, యాదగిరి, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL