Malkajgiri: మల్కాజిగిరిలో జై భవాని యూత్ అసోసియేషన్ దేవీ నవరాత్రి ఉత్సవాలు!

Malkajgiri: మల్కాజిగిరి తాళ్లబస్తీలో జై భవాని యూత్ అసోసియేషన్ 25వ ఏట నవరాత్రి వేడుకలను నిర్వహించింది. ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు.

Bodike Manohar, Malkajgiri
Published on: 15 Oct 2026 10:39 PM IST
Malkajgiri
X

Malkajgiri: మల్కాజిగిరిలో జై భవాని యూత్ అసోసియేషన్ దేవీ నవరాత్రి ఉత్సవాలు!

మల్కాజిగిరి: మల్కాజిగిరి ఈస్ట్ ఆనంద్ బాగ్ తాళ్లబస్తీలో జై భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గత 25 ఏళ్లుగా అసోసియేషన్ సభ్యులు భక్తిశ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. దసరా దేవీ నవరాత్రుల సందర్భంగా గురువారం రాత్రి మల్కాజిగిరి ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎంజేఎఫ్ రాష్ట్ర నాయకుడు మనోహర్ హాజరై అసోసియేషన్ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాళ్లబస్తీలో జై భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 25 ఏళ్లకు పైగా దేవీ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు ఐక్యతను చాటుతాయని పేర్కొన్నారు.

అనంతరం అసోసియేషన్ సభ్యులు నాయకులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రా కార్యక్రమంలో భక్తి పాటలు భక్తులను అలరించాయి. కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు యు. రామచందర్ మాదిగ, పోశాలు, కృష్ణ, బలరాం, రామాంజనేయులు, పవన్ కళ్యాణ్, నిఖిల్, పి. శివకుమార్, గణేష్, బాలు, రాజేష్, జ్ఞానేశ్వర్, ప్రభాకర్, కాశి, మనోహర్, జస్వంత్ తదితరులతో పాటు కాలనీవాసులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri