Keesara: చంద్రపురి కాలనీ సమగ్ర అభివృద్ధే ధ్యేయం: శ్రీకాంత్ యాదవ్!
Keesara: చంద్రపురి కాలనీ మోహన్రావు నగర్లో రూ.14 లక్షలతో చేపట్టిన డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు కార్పొరేటర్ లావణ్య, కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ శంకుస్థాపన చేశారు.
Keesara: చంద్రపురి కాలనీ సమగ్ర అభివృద్ధే ధ్యేయం: శ్రీకాంత్ యాదవ్!
కీసర: మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కీసర సర్కిల్ చంద్రపురి కాలనీ డివిజన్ మోహన్ రావు నగర్ కాలనీ లో 14 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు సీసీ రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ బింగి లావణ్య సతీష్ గౌడ్ తో కలిసి శంకుస్థాపన చేసిన డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్.
ఈ సందర్భంగా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ... చంద్రపురి కాలనీ డివిజన్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కారింగుల రాజు గౌడ్, పసుపులేటి భాస్కర్ రావు, ఉపాధ్యక్షులు గోనె చిట్టి బాబు, ప్రధాన కార్యదర్శి మాధవ రెడ్డి, అధికార ప్రతినిధి మొగిలిపాక పరశురామ్, కోశాధికారి అశోక్ గుప్తా, సాయి కృష్ణ (మిట్టు), కాలనీ అధ్యక్షులు సార్ల రమేష్, ఉపాధ్యక్షులు స్వామి గౌడ్, నాయకులు సత్యనారాయణ చారి, సత్య, అశోక్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.




