Malkajgiri: మాదిగ సంక్షేమ సంఘ నాయకుడు నర్సింగరావు జన్మదిన వేడుకలు!
Malkajgiri: మల్కాజిగిరి మాదిగ సంక్షేమ సంఘం, బీఆర్ఎస్ నాయకుడు సంధిగారి నర్సింగరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
Malkajgiri: మాదిగ సంక్షేమ సంఘ నాయకుడు నర్సింగరావు జన్మదిన వేడుకలు!
మల్కాజిగిరి: మల్కాజిగిరి మాదిగ సంక్షేమ సంఘ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు సంధిగారి నర్సింగరావు పుట్టినరోజు సందర్భంగా మల్కాజిగిరి లోని వారినివాసంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మాదిగ సంక్షేమ సంఘం నాయకులు తో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్కాజిగిరి లో మాదిగ సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్న నాయకులు నర్సింగ్ రావు అని రానున్న రోజుల్లో జాతి కోసం మరిన్ని సేవలు అందించాలని మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, కేశపాగ రామచందర్ మాదిగ, ఎం జె ఎఫ్ రాష్ట్ర నాయకులు మనోహర్,జీలుగు కృష్ణ,బి సోమరాజు, అర్జున్,చందర్,గోవింద్ ఎల్లేష్,సుదర్శన్, సంతోష్,రామగల గణేష్,రాజు,కుమార్, రాపోలు ఆనంద్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.




