Malkajgiri: మల్కాజిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు
Malkajgiri: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మల్కాజిగిరి పీహెచ్‌సీలో వైద్యులకు సత్కారం. హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌పై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కీలక ఆదేశాలు.
Malkajgiri: మల్కాజిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు
మల్కాజిగిరి: ప్రభుత్వ హాస్పిటల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మల్కాజిగిరి ఎమ్మేల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.మల్కాజిగిరి ప్రభుత్వ హాస్పిటల్ లోని డాక్టర్లను సన్మానం చేసారు.
ఈ సందర్భంగా ఎమ్మేల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వైద్యులను దేవుడితో సమానంగా పూజించే సమాజంలో మనం బ్రతుకుతున్నామని అలాంటి సమాజానికి డాక్టర్లు చేసే సేవ ఎన్నటికీ మర్చిపోలేని వారి సేవలను కొనియాడారు.ఇంట్లో, బయట ఎన్నో మానసిక ఒత్తిడిని తట్టుకుంటు కూడా మొఖంపై ఒక చిరునవ్వుతో వచ్చిన రోగులకు వైద్యంచేయండం సామాన్యమైన పని కాదని, అలాంటి వైద్యులపై మనం అసహనం వ్యక్తం చేయడం.
హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు. HPV వ్యాక్సిన్ విషయంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వెనకబడి ఉందని,ఇప్పటి వరకు కేవలం 3 శాతం వ్యాక్సినేషన్ కావడం ఆశ్చర్యకరమైన విషయమని తక్షణమే స్కూళ్లలో వ్యాక్సిన్ పై అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వచ్చే లాభాలను వివరించాలని డాక్టర్లను మర్రి రాజశేఖర్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లు ,హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




