Malkajgiri: కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై ఎమ్మెల్యే మర్రి నిరసన
Malkajgiri: కాంగ్రెస్ 1000 రోజుల ప్రజా వ్యతిరేక పాలనపై మల్కాజిగిరిలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన.
Malkajgiri: కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై ఎమ్మెల్యే మర్రి నిరసన
మల్కాజ్‌గిరి: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మల్కాజిగిరి నియోజకవర్గంలో శుక్రవారం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో వివిధ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.పలు ప్రాంతాల్లో సదస్సులు, వంటా వార్పు కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ హామీల అమలుకు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, కేసీఆర్ కిట్, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు తదితర హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
వృద్ధులు,వికలాంగులు, మహిళలు,విద్యార్థులు, పేద కుటుంబాలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు ఎన్నికల హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
చంద్రగిరి కాలనీలో నిరసన
మల్కాజ్‌గిరి సర్కిల్ పరిధిలోని చంద్రగిరి కాలనీలో సూర్యోదయ వెల్ఫేర్ సొసైటీ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.మహిళలు, వృద్ధులు, వికలాంగులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రభుత్వ హామీల అమలుకు డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కార్యక్రమంలో మాజీ ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్ మేకల సునీత,రాము యాదవ్,బీఆర్‌ఎస్ నాయకులు బద్దం పరుశురాం రెడ్డి,జేఏసీ వెంకన్న,జీకే హనుమంతరావు, ప్రభాకర్ గౌడ్,వీరేశం యాదవ్,చిన్న యాదవ్, శ్రీనివాస్ రెడ్డి,చంద్ర మౌళి,భాగ్యనంద రావు, సాయి గౌడ్,ఫరీద్, చందు, హేమంత్ పటేల్, బాలకృష్ణ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు,యువకులు పాల్గొన్నారు.




