Malkajgiri: చింతల్ బస్తీలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గణేష్ పూజలు
Malkajgiri: మల్కాజిగిరి చింతల్ బస్తీలో శ్రీ రుద్ర ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పూజలు చేశారు.
Malkajgiri: చింతల్ బస్తీలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గణేష్ పూజలు
Chintal Basti: మల్కాజిగిరి చింతల్ బస్తీలో శ్రీ రుద్ర ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి వేడుకల్లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని అన్నప్రసాదాలను స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ నవరాత్రి వేడుకలను భక్తిశ్రద్ధలతో,ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు.భక్తులు, నిర్వాహకులు సమన్వయంతో పండుగను విజయవంతంగా నిర్వహించాలని కోరారు.
ఈ కారూ బద్దం పరుషం రెడ్డి,జగదీష్ గౌడ్,సిక్క ప్రభాకర్ గౌడ్, చిన్న యాదవ్,రమేష్, ఉపేందర, సంధి, గారి నర్సింగ్ రావు, బాబురావు, జి కృష్ణ, బాలకృష్ణ, జంగారాజు, శ్రీకాంత్ యాదవ్, పిట్టల శ్రీనివాస్, ఉమాపతి, పి శ్రీనివాస్, సోమరాజు, గౌతమ్, రోహన్, కౌశల్ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, స్థానికులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.




