Eatala Rajender: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ‘దిశ’ సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్ ఆదేశం

Eatala Rajender: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టరేట్‌లో ఎంపీ ఈటల రాజేందర్ అధ్యక్షతన ‘దిశ’ సమావేశం జరిగింది.

PURENDAR, ALWAL
Published on: 8 May 2026 6:57 PM IST
Eatala Rajender
X

Eatala Rajender: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ‘దిశ’ సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్ ఆదేశం

మేడ్చల్: కేంద్ర ప్రభుత్వం నుంచి అమలయ్యే పథకాలు పై మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ ఆధ్వర్యంలో దిశ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్ష సమావేశానికి మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్(MMC) కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి తోపాటు మేడ్చల్ జిల్లలోని మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి, మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

ఈసందర్బంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు చిత్తశుద్ధితో పరిష్కరించేలా కృషి చేయాలని, ప్రజా సమస్యలపై అధికారులు జవాబుదారీగా ఉండాలని సూచించారు. కేంద్రం నుండి మంజూరైన అభివృద్ధి నిధులు సకాలంలో పనులకు ఉపయోగించాలని, పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని దిశ వేదికగా అధికారులను ఆదేశించారు. అనంతరం మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ను స్థానికతను గుర్తించి అర్హులైన పేదలకు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ఇతర ప్రాంతాల వారికి కూడా కేటాయించారని, ప్రస్తుత ప్రభుత్వం స్థానికులకు పది నుంచి పదిహేను శాతం కేటాయిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా ఉండే పేదలకు ఇళ్లను కేటాయించాలని సూచించారు. పేద ప్రజల కోసం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తే.. తెలంగాణలో సక్రమంగా అమలు కావడం లేదని తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి, విద్యుత్ వంటి వివిధ విభాగాలపై చర్చించి సమస్యలు పరిష్కరించాలని దిశ వేదికగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL

Next Story