Malkajgiri: మహిళా సంఘాలతో ఘనంగా పోలీసుల రాఖీ వేడుకలు!
Malkajgiri: మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి ఆదేశాలతో నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్‌లో మహిళా సంఘాల సభ్యులతో కలిసి పోలీసులు రాఖీ వేడుకలను నిర్వహించారు.
Malkajgiri: మహిళా సంఘాలతో ఘనంగా పోలీసుల రాఖీ వేడుకలు!
మల్కాజిగిరి: మల్కాజిగిరి పోలీసు కమిషనర్ బి. సుమతి ఆదేశాల మేరకు కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో కలిసి పోలీసులు రాఖీ పండుగను నిర్వహించారు. ఇందులో భాగంగా నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ వెంకటయ్య ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులతో రాఖీ వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ వెంకటయ్య మాట్లాడుతూ మహిళలకు చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమన్నారు. మహిళలు తమ పరిసర ప్రాంతాల్లో జరిగే అసాంఘిక కార్యకలాపాలను గుర్తించి పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. నేరాల నియంత్రణలో పోలీసులతో కలిసి మహిళలు కూడా తమవంతు బాధ్యతగా ముందుకు రావాలని కోరారు.
మహిళల భద్రత, నేరాల నియంత్రణకు పోలీసులతో ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. పోలీసులకు, ప్రజలకు మధ్య స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే రాఖీ వేడుకల ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేరేడ్‌మెట్ పోలీస్ సిబ్బంది, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.




