Secunderabad: బేగంపేట్లో బైక్ దొంగల ముఠా అరెస్ట్ 36 బైకులు స్వాధీనం!
Secunderabad: సికింద్రాబాద్ బేగంపేట్లో 36 బైక్లు చోరీ చేసిన ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు. పాత నేరస్థుడిపై పీడీ యాక్ట్ పెట్టనున్నట్లు మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ వెల్లడి.
Secunderabad: బేగంపేట్లో బైక్ దొంగల ముఠా అరెస్ట్ 36 బైకులు స్వాధీనం!
Secunderabad: సరైన పత్రాలు లేని బైకు లను కొని ప్రజలు మోసపోవద్దని మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ అన్నారు జల్సాలకు అలవాటు పడి రద్దీ ప్రదేశాలలో పార్క్ చేసి ఉండే బండ్లను దొంగతనం చేస్తున్న ముఠాను బేగంపేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివిధ జిల్లాలకు చెందిన రమేష్, మల్లేష్ లను బెగంపేట్ పోలీసులు అరెస్ట్ చేయగా ఇదే ముఠా లోని రాజ్ కుమార్ లను గతంలోనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు వీరి నుండి సుమారు 20 లక్షల విలువ చేసే 36 బైకులను రికవరీ చేయగా ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు... రాజ్ కుమార్ అనే పాత నెరస్తుడు పై 24 కేసులలో జైలు జీవితం అనుభవించి, జైల్ నుండి విడుదలయ్యాక మళ్ళీ దొంగతనం మొదలు పెట్టాడు తరుచుగా పలు పోలీసు స్టేషన్ల పరిధిలో దొంగతనాలు చేయడంతో పీడీ ఆక్ట్ ప్రపోజ్ చేయనున్నట్లు డీసీపీ శ్రీధర్ తెలిపారు




