Malkajgiri: మల్కాజిగిరి పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు!

Malkajgiri: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌లో పదవీ విరమణ పొందిన ముగ్గురు అధికారులను డీసీపీ శివ కుమార్ ఘనంగా సత్కరించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 30 April 2026 8:05 PM IST
Malkajgiri
X

Malkajgiri: మల్కాజిగిరి పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు!

Malkajgiri: ఈ రోజు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ లో పనిచేస్తున్న ముగ్గురు పోలీస్ అధికారులను మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సిపి గారీ ఆదేశాలతో సన్మానం చేయడం జరిగింది. కె. కరుణాకర్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్, యాంటీ హ్యూమన్ ట్రాఫిక్, హెచ్. బండయ్య, సబ్ ఇన్స్పెక్టర్, సరూర్నగర్ పోలీస్ స్టేషన్, ఆర్మ్డ్ హెడ్ క్వార్టర్ లో పెనిచేస్తున్న బి. కిష్టయ్య, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ లు పదవి విరమణ పొందినారు. మల్కాజ్గిరి అడ్మిన్ డీసీపీ శివ కుమార్ మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఎంతో కాలం పాటు పోలీసుశాఖలో సమర్థవంతంగా, క్రమశిక్షణతో పనిచేసి తమ సేవలు అందించినందుకు అభినందించారు.

ఈ కార్యక్రమంలో CAO అడ్మిన్ శ్రీనివాస్, చీఫ్ ఎకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాస్, అశోక్ రెడ్డి, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు సిహెచ్. భద్రా రెడ్డి, కృష్ణా రెడ్డి, ఎస్టేట్ ఆఫీసర్ నాయుడు, కో ఆపరేటివ్ అకౌంట్స్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్, బాలరాజు ట్రెజరర్, డైరెక్టర్స్ సువర్ణ, వల రాజు తదితరులు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story