Malkajgiri: మల్కాజిగిరిలో ట్రాఫిక్ నిబంధనలపై పోలీసుల అవగాహన కార్యక్రమం

Malkajgiri: మల్కాజిగిరిలో పోలీసుల ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మైనర్లు బండి నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సీఐ కోరారు.

Bodike Manohar, Malkajgiri
Published on: 30 Oct 2026 9:59 PM IST
Malkajgiri
X

Malkajgiri: మల్కాజిగిరిలో ట్రాఫిక్ నిబంధనలపై పోలీసుల అవగాహన కార్యక్రమం

మల్కాజిగిరి: రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండటంతో పాటు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని మల్కాజిగిరి పోలీసులు సూచించారు. శుక్రవారం సాయంత్రం మల్కాజిగిరి చౌరస్తాలో పోలీసుల ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ తమతో పాటు ఇతరుల ప్రాణాల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, తల్లిదండ్రులు తమ పిల్లలు వాహనాలు నడపకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.

మైనర్లు వాహనాలు నడుపుతున్న విషయాన్ని గుర్తించినప్పుడు తల్లిదండ్రులు వారికి రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించి బాధ్యతగా వ్యవహరించేలా చూడాలన్నారు.

పోలీస్ కమిషనర్ బి. సుమతి, డీసీపీ, ఏసీపీ అధికారుల ఆదేశాల మేరకు ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై చైతన్యం కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్సై రవికుమార్ రెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri