Malkajgiri: విద్యార్థిని రేణు శ్రీకి కిక్‌బాక్సింగ్‌లో స్వర్ణ పతకం
Malkajgiri: మల్కాజిగిరి నేరేడ్‌మెట్‌కు చెందిన పదో తరగతి విద్యార్థిని రేణు శ్రీ రాష్ట్రస్థాయి కిక్‌బాక్సింగ్ పోటీల్లో స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.
Malkajgiri: విద్యార్థిని రేణు శ్రీకి కిక్‌బాక్సింగ్‌లో స్వర్ణ పతకం
మల్కాజిగిరి: నేరేడ్‌మెట్ వినాయక్‌నగర్ బస్తీకి చెందిన పదో తరగతి విద్యార్థిని రేణు శ్రీ కిక్ బాక్సింగ్‌లో రాష్ట్రస్థాయిలో సత్తా చాటింది. మూడు గుళ్ల సమీపంలోని రాజధాని హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్న రేణు శ్రీ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన 70వ రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించింది.
నాంపల్లి రెడ్‌హిల్స్‌లోని జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన అండర్-17 విభాగం పోటీల్లో రేణు శ్రీ ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచింది. చిన్ననాటి నుంచే కిక్ బాక్సింగ్‌పై ఆసక్తి పెంచుకున్న ఆమె, కఠోర శ్రమతో సాధన చేస్తూ రాష్ట్రస్థాయిలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
రేణు శ్రీ విజయం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఆమె తండ్రి, ఆటో డ్రైవర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ చిన్నతనం నుంచే కుమార్తె క్రీడపై పట్టుదలతో శిక్షణ పొందుతోందన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో స్వర్ణ పతకం సాధించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో రేణు శ్రీ జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో మరిన్ని పతకాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.




