Malkajgiri: మల్కాజిగిరిలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Malkajgiri: మల్కాజిగిరి డివిజన్‌లో అర్హులైన కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Bodike Manohar, Malkajgiri
Published on: 30 Sept 2026 5:19 PM IST
Malkajgiri
X

Malkajgiri: మల్కాజిగిరిలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

మల్కాజిగిరి: మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని వివిధ కమ్యూనిటీ హాళ్లలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు జీడి సంపత్ పాల్గొని అర్హులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా జీడి సంపత్ మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ కొత్త రేషన్ కార్డుల జారీపై తగిన చర్యలు తీసుకోలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంతోపాటు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను చేపట్టిందన్నారు.

మల్కాజిగిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డులు,స్మార్ట్ రేషన్ కార్డులు అందుతున్నాయని తెలిపారు.అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జీడి చరణ్జిత్ గౌడ్,సీనియర్ నాయకులు కొండా గౌడ్,గౌసుదిన్ భాయ్,జి ఎన్ వి సతీష్,భాస్కర్, రవీందర్,రవి కిరణ్,గణేష్,ఇంతియాజ్,సతీష్ గౌడ్,పార్థసారథి తదితరులు పాల్గొనారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri