Malkajgiri: ఉత్తమ్ నగర్ - ఏఓసీ రోడ్డులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపు

Malkajgiri: మల్కాజిగిరి ఉత్తమ్ నగర్ టీ జంక్షన్ - ఏఓసీ రోడ్డులో సీసీ రోడ్డు పనుల నేపథ్యంలో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు, ప్రత్యామ్నాయ మార్గాల వెల్లడి.

Bodike Manohar, Malkajgiri
Published on: 17 Aug 2026 9:22 PM IST
Malkajgiri
X

Malkajgiri: ఉత్తమ్ నగర్ - ఏఓసీ రోడ్డులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపు

మల్కాజిగిరి: మల్కాజిగిరి ఉత్తమ్ నగర్ టీ జంక్షన్–ఏఓసీ రోడ్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ఆగస్టు 18 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు తాత్కాలిక ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు. నిర్మాణ పనుల కారణంగా పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నియంత్రించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఆనంద్‌బాగ్ ఎక్స్‌రోడ్, గౌతమ్ నగర్, మల్కాజిగిరి వైపు నుంచి ఏఓసీ జంక్షన్ వైపు వెళ్లే వాహనాలను ఉత్తమ్ నగర్ టీ జంక్షన్ వద్ద అనుమతించరు. వాహనదారులు గౌతమ్ నగర్ రోడ్డు, తుకారామ్‌గేట్ మెయిన్ రోడ్డు,ఈస్ట్ మారేడ్‌పల్లి రోడ్డు మీదుగా ఏఓసీ జంక్షన్‌కు చేరుకోవాలని సూచించారు.

అదేవిధంగా ఏఓసీ జంక్షన్ నుంచి ఉత్తమ్ నగర్ టీ జంక్షన్ వైపు వెళ్లే వాహనాలను ఈస్ట్ మారేడ్‌పల్లి రోడ్డు వైపు మళ్లించనున్నారు. అక్కడి నుంచి తుకారామ్‌గేట్ మెయిన్ రోడ్డు,గౌతమ్ నగర్ రోడ్డు మీదుగా ఉత్తమ్ నగర్ టీ జంక్షన్‌కు చేరుకునేలా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేశారు.

నిర్మాణ పనుల నేపథ్యంలో వాహనదారులు ముందస్తుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని,ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ అధికారులు విజ్ఞప్తి చేశారు

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri

Next Story