Malkajgiri: మల్కాజిగిరిలో బోనాల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు

Malkajgiri: మల్కాజిగిరి వాణి నగర్ విజయ గణపతి ఆలయంలో బోనాల చెక్కుల పంపిణీ. 230 ఆలయాలకు రూ.76 లక్షలను విప్ బిర్లా ఐలయ్య, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అందజేశారు.

Bodike Manohar, Malkajgiri
Published on: 3 Aug 2026 2:05 PM IST
Malkajgiri
X

Malkajgiri: మల్కాజిగిరిలో బోనాల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు

మల్కాజిగిరి: లో బోనాల చెక్కుల పంపిణీ చేసిన విప్ బిర్లా ఐలయ్య

అమ్మవారి కృపా కటాక్షాలతో మల్కాజిగిరి ప్రాంత ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య తెలిపారు.నియోజకవర్గం అమ్మవారి బోనాల పండుగ చెక్కుల పంపిణీ కార్యక్రమం మల్కాజిగిరి వాణి నగర్ విజయ గణపతి ఆలయంలో జరిగింది ఈ కార్యక్రమానికి అతిధులుగా బీర్లా ఐలయ్య స్థానిక శాసనసభ్యులు రాజశేఖర్ రెడ్డి లు హాజరయ్యారు.

నియోజకవర్గ పరిధిలో 230 ఆలయాలకు 76 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు.గత ప్రభుత్వం కంటే కూడా రెండు సంవత్సరాలలో బోనాల పండుగ ఘనంగా జరుపుకోవాలని నిధులను అధికంగా కేటాయించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధి అంశాల పైన సమావేశాన్ని నిర్వహించుకుందామని స్పష్టం చేశారు.అంతకన్నా ముందు ఆలయంలో విప్పు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ అధికారులు,మాజీ కార్పొరేటర్ లు,ఆలయ కమిటీ చైర్మన్ లు,మాజీ చైర్మన్ వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri

Next Story