Secunderabad: పార్టీ మార్పు వార్తలపై మల్లారెడ్డి ఫైర్!

Secunderabad: పార్టీ మార్పు ప్రచారాలపై మాజీ మంత్రి మల్లారెడ్డి తీవ్రంగా స్పందించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 29 April 2026 5:23 PM IST
Secunderabad
X

Secunderabad: పార్టీ మార్పు వార్తలపై మల్లారెడ్డి ఫైర్!

Secunderabad: తాను బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని, ప్రధానమంత్రిని కలిసినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదని, ఆరోపణలకు తాను సమాధానం చెప్పవలసిన అవసరం లేదంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఆవేశంతో ఊగిపోయారు. సికింద్రాబాద్ బోయిన్పల్లి లో మల్లారెడ్డి దత్త పుత్రుడు టింకు గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సేవా కార్యక్రమాల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు.. చీరల పంపిణీ తో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించారు.

తన దత్తపుత్రుడు సేవా కార్యక్రమాలతో తన పేరు నిలబెడుతున్నారని, ప్రతి పండుగకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తన పేరు నిలబేడుతున్న రంటూ మల్లారెడ్డి తెలియజేశారు. ఐతే పార్టీ మార్పు విషయం పై మీడియా ప్రశ్నించగానే మల్లారెడ్డి ఆవేశంగా ఊగిపోయారు.. తను బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని, ప్రధానమంత్రిని కలిసినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదని,, సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలకు తాను స్పందించవలసిన అవసరం లేదంటూ ఆవేశంగా మల్లారెడ్డి వెళ్లిపోయారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story