Abhishek Reddy: బొంగ్లూర్ క్రాస్ రోడ్స్ లో ప్రతిష్టాత్మక యువ చైతన్య వేదిక
Abhishek Reddy: ప్రమీద గార్డెన్స్ లో యువనేత మల్ రెడ్డి అభిషేక్ రెడ్డి ఆధ్వర్యంలో ఆకెళ్ళ రాఘవేంద్ర మోటివేషనల్ సెషన్ తో 'యువ చైతన్య వేదిక' జరగనుంది.
అభిషేక్ రెడ్డి: యువనేత మల్ రెడ్డి అభిషేక్ రెడ్డి గారి నేతృత్వంలో యువతకు స్ఫూర్తినిచ్చే "యువ చైతన్య వేదిక" కార్యక్రమం ఎల్లుండి గురువారం బొంగ్లూర్ క్రాస్ రోడ్‌లోని ప్రమీద గార్డెన్స్ వేదికగా ఘనంగా జరగనుంది. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
గురువారం ఉదయం 9గంటల నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ మోటివేషన్ స్పీకర్ ఆకెళ్ళ రాఘవేంద్ర గారు పాల్గొని, యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా, లక్ష్యసాధన దిశగా ముందుకు నడిపించేలా విలువైన సందేశాలను అందించనున్నారు.
అంతేకాకుండా నేటి యువతకు అత్యంత అవసరమైన ఉద్యోగ అవకాశాలు, డ్రగ్స్ మహమ్మారి నిర్మూలన, సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకునే విధానం, వ్యక్తిత్వ వికాసం, కెరీర్ మార్గదర్శకం వంటి కీలక అంశాలపై ఆయా రంగాల నిపుణులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి. యువత ఉత్సాహంగా పాల్గొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని కోరడమైనది.




