Hyderabad: భూ కబ్జా ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి మల్రెడ్డి రాంరెడ్డి కౌంటర్!

Hyderabad: సర్వే నంబర్ 44 భూములపై మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేసిన ఆరోపణలను రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి తిప్పికొట్టారు.

AJAY, HAYATH NAGAR
Published on: 9 July 2026 5:57 PM IST
Hyderabad
X

Hyderabad: భూ కబ్జా ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి మల్రెడ్డి రాంరెడ్డి కౌంటర్!

Hyderabad: తుర్కయంజాల్ మున్సిపాలిటీ మునగనూరు లోని సర్వేనెంబర్ 44 లో 40 ఎకరాల ప్రభుత్వ స్థలం కబ్జా గురైనట్లు బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్ డవలప్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మల్ రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ. మునగనూరు సర్వే నంబర్ 44 లో మాపై వస్తున్న ప్రచారం అవాస్తవమన్నారు.మేము కానీ మా నాయకులు గాని ఎలాంటి ల్యాండ్ కబ్జాల చేయలేదన్నారు.

మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములను కాపాడాలనే మా ఉద్దేశమన్నారు. మా ప్రాంతం అభివృద్ధి చేయడమే మా లక్ష్యం, జరుగుతున్న అభివృద్ధి చూడలేక ఇలాంటి ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. మేము ఏం చేస్తున్నామో ప్రజలకు, మీడియా కు తెలుసన్నారు.ఒక్క గజం గాని, ఒక్క ఎకరం గాని ఎక్కడైనా కబ్జా చేసిన, కొన్న వాస్తవాలు మీడియా లో రాయవచ్చన్నారు. అబ్దుల్లాపూర్ మెట్ MRO విజయ రెడ్డి మృతికి కారణం మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డినే మూల కారణమన్నారు. మాపై ఆరోపణలు చేయడం కిషన్ రెడ్డి మానుకోవాలని హెచ్చరించారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story